Health is Wealth

Health is Wealth

Share

ఆరోగ్యమే మహాభాగ్యం

Photos from Health is Wealth's post 09/05/2021

Mother's day to all🎉

Photos from Health is Wealth's post 30/04/2021

ఈ ఆహారంతో రోగ నిరోధక శక్తి+ఆక్సిజ‌న్

Photos from Health is Wealth's post 02/04/2021

మ‌హాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే. మాన‌వాళి ప‌ట్ల ప్రేమ‌, నిస్స‌హాయుల ప‌ట్ల క‌రుణ‌, శ‌త్రువుల ప‌ట్ల క్ష‌మ‌, ఆకాశమంత‌టి స‌హ‌నం, అవ‌ధులు లేని త్యాగం ఇది యేసు క్రీస్తు జీవితం మాన‌వాళికి ఇచ్చిన సందేశం.

25/03/2021

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2కోట్ల వ్యయంతో కదక్నథ్ కోళ్ల ఫర్మ్ స్టార్ట్ చేస్తున్నారు, వివరాల కోసం ప్రదీప్ ఫార్మ్స్ నీ కలవటం,మా అనుభవాలని ఈరోజు సాక్షి లో ప్రచురించటం జరిగింది

23/03/2021

శక్తి కావాలా...ఇదిగో జావ!

వేసవికాలంలో ఎక్కువగా అలసిపోతుంటాం. చిన్న పని చేసినా నీరసం వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు కాస్త జావ తాగితే చాలు. రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతాం. ఇంకెందుకాలస్యం... రకరకాల జావలను మీరూ ప్రయత్నించండి మరి.

కావాల్సినవి: రాగిపిండి- రెండు టేబుల్‌స్పూన్లు, బెల్లం- చిన్నముక్క, పాలు- అరకప్పు, యాలకులపొడి- చిటికెడు. మజ్జిగజావ కోసం: రాగిపిండి రెండు టేబుల్‌స్పూన్లు, పల్చటి మజ్జిగ- కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ- ఒకటి, జీలకర్ర పొడి- చిటికెడు, కొత్తిమీర, కరివేపాకు తరుగు- కొద్దిగా, ఉప్పు- తగినంత.
తయారీ: రాగిపిండిని అరకప్పు నీళ్లలో ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్లలో కలిపి సన్నని మంట మీద ఉండలు కట్టకుండా ఐదు నుంచి ఎనిమిది నిమిషాలపాటు ఉడికించాలి. జావ తియ్యగా కావాలంటే కొద్దిగా బెల్లం, అరకప్పు పాలు, చిటికెడు యాలకుల పొడి వేసుకుని రెండు నిమిషాలపాటు ఉడికించాలి. మజ్జిగతో కావాలంటే.. జావ తయారైన తర్వాత పల్చటి మజ్జిగ, సన్నగా తరిగైన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు తరుగు చేర్చాలి.

16/02/2021

*ఐపిసిలో సెక్షన్ ల అర్థం తెలుసుకోండి*
======================
* సెక్షన్ 307 * = హత్యాయత్నం
* సెక్షన్ 302 * = హత్యకు శిక్ష
* సెక్షన్ 376 * = అత్యాచారం
* సెక్షన్ 395 * = దోపిడీ
* సెక్షన్ 377 * = అసహజ కదలికలు
* సెక్షన్ 396 * = దోపిడీ
సమయంలో హత్య
* సెక్షన్ 120 * = కుట్ర
* సెక్షన్ 365 * = కిడ్నాప్
* సెక్షన్ 201 * = సాక్ష్యాలను తొలగించడం
* సెక్షన్ 34 * = వస్తువుల ఉద్దేశం
* సెక్షన్ 412 *= జరుపుకుంటున్నారు
* సెక్షన్ 378 * = దొంగతనం
* సెక్షన్ 141 * = అక్రమ డిపాజిట్
* విభాగం 191 * = తప్పు లక్ష్యం
* సెక్షన్ 300 * = హత్య
* సెక్షన్ 309 * = ఆత్మహత్య ప్రయత్నం
* సెక్షన్ 310 * = మోసం
* సెక్షన్ 312 * = గర్భస్రావం
* సెక్షన్ 351 * = దాడి చేయడానికి
* సెక్షన్ 354 * = మహిళలపై సిగ్గు
* సెక్షన్ 362 * = కిడ్నాప్
* సెక్షన్ 415 * = ట్రిక్
* సెక్షన్ 445 * = దేశీయ వివక్ష
* సెక్షన్ 494 * = జీవిత భాగస్వామి
జీవితంలో పునర్వివాహం
* సెక్షన్ 499 * = పరువు నష్టం
* సెక్షన్ 511 * = నేరారోపణపై జీవిత ఖైదు.

మన దేశంలో, మనకు తెలియని కొన్ని చట్టాలు ఉన్నాయి.

*ఐదు ఆసక్తికరమైన విషయాలు*
ఆ సమాచారం తెలుసుకుందాం,
ఇది జీవితంలో ఎప్పుడైనా
ఉపయోగపడుతుంది.

*(1) సాయంత్రం 6 గం,,తర్వాత ఉదయం 6గం,, లోపు మహిళలను అరెస్టు చేయలేము* -

క్రిమినల్ కోడ్, సెక్షన్ 46 ప్రకారం, సాయంత్రం 6 గంటల తరువాత మరియు ఉదయం 6 గంటలకు ముందు, భారత పోలీసులు ఎంత తీవ్రమైన నేరం చేసినా, ఏ మహిళను అరెస్టు చేయలేరు. పోలీసులు అలా చేస్తే, అరెస్టు చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఈ పోలీసు అధికారి ఉద్యోగానికి హాని కలిగించవచ్చు.

*(2.) సిలిండర్ పేలడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై రూ .4 మిలియన్ల వరకు బీమా పొందవచ్చు*

పబ్లిక్ లయబిలిటీ పాలసీ ప్రకారం, ఏదైనా కారణం చేత మీ ఇంటిలో సిలిండర్ పేలిపోయి, మీరు ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటే, మీరు వెంటనే గ్యాస్ కంపెనీ నుండి బీమా రక్షణ పొందవచ్చు. గ్యాస్ కంపెనీ నుండి రూ .4 మిలియన్ల వరకు బీమా క్లెయిమ్ చేయవచ్చు. కంపెనీ మీ దావాను తిరస్కరించినా లేదా వాయిదా వేసినా, దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే, గ్యాస్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయవచ్చు.

*(3) ఏదైనా హోటల్ 5 నక్షత్రాలు అయినా; మీరు ఉచితంగా నీరు త్రాగవచ్చు మరియు వాష్‌రూమ్‌ను ఉపయోగించవచ్చు* -

ఇండియన్ సిరీస్ యాక్ట్, 1887 ప్రకారం, మీరు దేశంలోని ఏ హోటల్‌కైనా వెళ్లి నీరు అడగవచ్చు మరియు త్రాగవచ్చు మరియు ఆ హోటల్ యొక్క వాష్‌రూమ్‌ను కూడా ఉపయోగించవచ్చు. హోటల్ చిన్నది లేదా 5 నక్షత్రాలు అయితే, వారు మిమ్మల్ని ఆపలేరు. హోటల్ యజమాని లేదా ఉద్యోగి మిమ్మల్ని తాగునీరు లేదా వాష్‌రూమ్ ఉపయోగించకుండా ఆపివేస్తే, మీరు చర్య తీసుకోవచ్చు. మీ ఫిర్యాదు ఈ హోటల్ లైసెన్స్ రద్దు చేయబడవచ్చు.

*(4) గర్భిణీ స్త్రీలను తొలగించలేరు* -

ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ప్రకారం, గర్భిణీ స్త్రీలను అకస్మాత్తుగా తొలగించలేరు. గర్భధారణ సమయంలో, యజమాని మూడు నెలల నోటీసు మరియు ఖర్చులలో కొంత భాగాన్ని చెల్లించాలి. అతను అలా చేయకపోతే, ప్రభుత్వ ఉపాధి సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదు సంస్థను మూసివేయడానికి కారణం కావచ్చు లేదా కంపెనీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

*(5) మీ ఫిర్యాదు రాయడానికి పోలీసు అధికారి నిరాకరించలేరు*

ఐపిసి సెక్షన్ 166 ఎ ప్రకారం, మీ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఏ పోలీసు అధికారి నిరాకరించలేరు. అతను అలా చేస్తే, అతనిపై సీనియర్ పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే, పోలీసు అధికారికి కనీసం * (6) * నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా తొలగింపును ఎదుర్కోవచ్చు.

ఇవి ఆసక్తికరమైన వాస్తవాలు, ఇవి మన దేశ చట్టం ప్రకారం వస్తాయి, కాని వాటి గురించి మనకు తెలియదు. మీ జీవితంలో ఉపయోగపడే ఆసక్తికరమైన విషయాలను మీకు అందించడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను.

*ఈ సందేశాన్ని మీ వద్ద ఉంచుకోండి, ఈ హక్కులు ఎప్పుడైనా చెల్లుతాయి*.
=================

Photos from Health is Wealth's post 26/01/2021
25/01/2021

Santosh Babu : తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు అత్యుత్తమ సైనిక పురస్కారం..? రేపే ప్రదానం..

Colonel Santosh Babu : గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో వీరోచితంగా పోరాడి అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్‌ బాబుకు అరుదైన గౌరవం దక్కనుందని తెలుస్తోంది.
గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో వీరోచితంగా పోరాడి అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్‌ బాబుకు అరుదైన గౌరవం దక్కనుందని తెలుస్తోంది. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గత ఏడాది భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం ప్రతిష్ఠాత్మక మహావీర చక్ర అవార్డును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు దేశ రాజధానిలో నిర్వహించే వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ఈ అవార్డును అందజేస్తారని సమాచారం. ఈ ఏడాది మహావీర చక్ర అవార్డు కోసం కల్నల్ సంతోష్ బాబు పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. దేశ రక్షణకు సంబంధించినంత వరకు రెండో అత్యుత్తమ పురస్కారం మహవీర చక్ర. ఈ ఏడాది ఈ అవార్డును కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం ప్రదానం చేయబోతోన్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు ధృవీకరించినట్లు జాతీయ వార్తా సంస్థ నిర్ధారించింది. మిలటరీ అవార్డుల్లో అత్యుత్తమైనది పరమవీర్ చక్ర. ఆ తరువాత మహవీర్ చక్ర, వీర్ చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర పతాకాలను అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డులను భావిస్తారు.

గతేడాది ఏడాది జూన్ 15వ తేదీన లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు జరిపిన దాడిలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఆయనతో పాటు 20 మంది అమరులు అయ్యారు. ఆయనతో పాటు సిపాయ్ ఓఝా, హవల్దార్ పళనిలకు అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డులను అందజేస్తారని తెలుస్తోంది. లఢక్ ఈశాన్య ప్రాంతంలో భారత భూభాగంపైకి అక్రమంగా చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన పీఎల్ఏ బలగాలను నిరోధించే సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.

18 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్న కల్నల్ సంతోష్ బాబు సారథ్యంలో జవాన్లు చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని అడ్డుకోగలిగారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి.. వారిని వెనక్కి తరిమి కొట్టగలిగారు. ఈ ఘర్షణల్లో రెండు వైపులా ప్రాణనష్టం సంభవించింది. చైనా తరఫున 50 మందికి పైగా పీఎల్ఏ సైనికులు మరణించినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. ఆ దేశ సైన్యాధికారులు దాన్ని ధృవీకరించలేదు. చైనా బలగాలను తరిమికొట్టడంలో, వారి దురాక్రమణను నిరోధించడంలో కల్నల్ సంతోష్ బాబు వీరోచితంగా పోరాడారని, చివరికి ప్రాణాలను సైతం వదిలారని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు . అప్పట్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. దేశ రక్షణ కోసం ఆయన చూపిన తెగువ, ఓ వైపు ప్రాణాలు పోతాయని తెలిసినా.. అక్కడి నుంచి కదలకుండా చూపిన నిబద్ధత గురించి తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుస్తాయ్.








#జనతా TV

23/01/2021
19/01/2021

From
19 Dec 2020: India all out for 36

To
19 Jan 2021: India breach The Gabba fortress and wins the series 2-1

Greatest Victory in Indian Test Cricket!

🇮🇳🙏🏼

16/01/2021

పాలిష్ బియ్యం మానండి..!

ఎప్పటి నుండైతే మనిషి మిల్లులను కనుక్కున్నాడో అప్పటి నుంచి బియ్యాన్ని పాలిష్ పట్టడం మొదలు పెట్టాడు.
ఎర్రటి బియ్యాన్ని పాలిష్ మరలో పోస్తే, ఆ మిల్లు ఆ బియ్యంపై ఒక పొరను చెక్కేస్తుంది. ఆ చెక్కగా వచ్చిన పై పొట్టును మొదటి పాలిష్ అంటారు.
ఈ పై పొరలో, బియ్యంలో ఉండే అతి ముఖ్యమైన పోషక పదార్థాలు 50 శాతం వరకూ పోతాయి. అవి ముఖ్యంగా 12 రకాలు. బి విటమిన్ల సముదాయం, విటమిన్-ఇ, పీచుపదార్థాలు, లిసిథిన్ మొదలైనవి. ఈ మొదటి పాలిష్ లో అన్నీ ముఖ్యమైన పోషకాలే ఉన్నాయి.
కాబట్టి ఆ తౌడును మందుల కంపెనీల వారు కొనుక్కొని మందుల తయారీకి వాడతారు. ఈ తౌడునే ఖాళీ గొట్టాలలో పోసి, బలానికి గొట్టాలుగా తాయారు చేసి మనకి అమ్ముతారు. మొత్తం తౌడునే కాకుండా ఆ
గొట్టాలలో నిల్వ ఉండడానికి, రంగుకు, వాసనకు కొన్ని మందులను కలిపి తయారు చేస్తారు.
తెల్లటి బియ్యం తిని బి-కాంప్లెక్స్ గొట్టాలు వేసుకోవడం ప్రజలకు తేలికగా ఉంది.
ఈ మొదటి పాలిష్ తౌడును
బలానికని పాలల్లో వాడే పొడుల్లో, ఇతర బలవర్దకమైన ఆహార పదార్థాలలో కలుపుతూ ఉంటారు.మొదటి పాలిష్ పోగా వచ్చిన బియ్యం కొద్దిగా తెలుపే తప్ప పూర్తిగా తెలుపు రావు. అందుచేత ఈ బియ్యాన్ని
మళ్లీ పాలిష్ మరలో పోస్తారు. దాంతో పెద్ద పొరను మిల్లులు దొలిచేస్తాయి. ఈ సారి తెల్లగా మెరిసిపోతూ వస్తాయి.
రెండవసారి వచ్చిన తౌడును (30 శాతం పోషక పదార్థాలుంటాయి) గేదెలకు, ఆవులకు, ఇతర
పశువులు, చేపలకు, రొయ్యలకు బలానికి వాడతారు. ఆ తెల్ల
బియ్యాన్ని మాత్రంవాడుకునేందుకు
మనం ఉంచుకుంటాం.
తౌడులో ఉండే పోషకాలు
Thiamine (B), Riboflavin (B)
Niacin, Pyridoxine (B)
Pantothenic acid, Biotin,
Choline, Folic acid, Inositol, zinc, iron, Manganese, Copper,
lodine

తెల్లటి బియ్యంతో నష్టాలెన్నో...
~~~~~~~~~~~~~~~~~
తెల్లటి బియ్యాన్నిఎన్నో సంత్సరాలుగా తింటూ శరీరానికి ఎంతో నష్టాన్ని కలిగించుకుంటున్నాం. తెల్లటి బియ్యం వల్ల నష్టాలను తెలుసుకుందాం.
1. బియ్యంలో ఉండే 12 రకాల బి విటమిన్స్ 80 శాతానికి పైగా కోల్పోయి, కేవలం 15, 20 శాతం మాత్రమే మిగులుతాయి.
2. శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్లు సరిగా లేకుండా ఉన్న తెల్లటి అన్నాన్ని తిన్నందున ఎక్కువగా అలసిపోవడం, త్వరగా నీరసం రావడం, పిక్కలు లాగడం,కష్టపడి పనిచేయలేక పోవడం మొదలైనవన్నీ వస్తాయి.
ఉదాహరణకు మన ఇళ్లలో ఇప్పుడున్న 70, 75
సంవత్సరాల ముసలివారికున్న ఓపిక 50 సంవత్సరాలవారికి లేదు. 50 సంవత్సరాల వారికున్న ఓపిక 25, 30 సంవత్సరాల వారికి లేదు, వీరికున్న ఓపిక చిన్న పిల్లల్లో లేదు. దీనికి కారణం చూస్తే తెల్లటి బియ్యాన్ని తినడం అని స్పష్టంగా తెలుస్తున్నది.

3. పై పొరలో విటమిన్ ఇ అనేది ఉంటుంది. ఇది త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. తెల్లటి బియ్యంలో ఇది పూర్తిగా ఉండదు.

4. లిసిధిన్ అనే పదార్థం తెల్లటి బియ్యంలో ఉండదు. ఈ పదార్థం మనలో కొవ్వు, (కొలెష్ట్రాల్) పదార్థాలు పేరుకోకుండా నివారించేందుకు కొవ్వుకు విరుగుడుగా పనిచేస్తుంది. తెల్లటి బియ్యం తినేవారికి ఈ రక్షణ శరీరంలో ఉండదు. గుండె జబ్బులు రాకుండా నివారించే శక్తి తెల్లటి బియ్యంలో ఉండదు.

5. పీచుపదార్థాలన్నీ బియ్యం పై పొరలలో ఉండడం వల్ల, తెల్ల బియ్యంలో పీచు లేనందువల్ల మలబద్ధకం వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు.

6. తెల్లటి బియ్యం తినేవారు ఎక్కువ బరువు పెరుగుతారు. ఈ బియ్యంలో పీచు పదార్థాలు
లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి, రక్తంలోనికి ఒకేసారి చేరిపోతుంది. దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చివేస్తుంది. ఫలితంగా మధుమేహ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి.

7. తెల్లటి అన్నం మెతుకులు సన్నగా ఉండే సరికి, సరిగా పంటి కింద పడక, నమలకుండా తేలిగ్గా జారి గొంతులోకి వెళ్లిపోతూ ఉంటాయి. నమలనందుకు నోటిలో గానీ, పొట్టలో గాని జీర్ణక్రియ సరిగా ఉండదు.

8. శరీరానికి ఎక్కువ సేపు వరకూ, ఎక్కువ శక్తిని
సమకూర్చలేదు. తిన్న 3,4 గంటలలోనే నీరసం వచ్చేట్లుగా చేస్తుంది.

9. తెల్లటి బియ్యం తినడం వల్ల బి కాంప్లెక్స్ గొట్టాలు, బలానికి టానిక్కులు తాగాల్సిన స్థితిని శరీరానికి కలిగిస్తున్నాం.

10. కాళ్లకు నీరు పట్టడం, తిమ్మిర్లు రావడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

11. తెల్లటి బియ్యంలో తేలిగ్గా జీర్ణమయ్యే కొవ్వు పదార్థాలుండవు. తౌడులోకి ఈ కొవ్వు పదార్థాలు వెళ్లిపోతున్నాయి. ఈ ఉపయోగపడే కొవ్వు పదార్థాలు హాని లేకుండా శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి. తెల్లబియ్యం తినే వారికి ఈ శక్తి లోపిస్తుంది.

12. తెల్లటి అన్నం రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. పచ్చళ్లను తినాలినిపించే విధంగా
చప్పదనముంటుంది.

బలాన్నిచ్చే దంపుడు బియ్యం
తౌడుకు 10, 15 రోజుల్లో పురుగులు పట్టేస్తాయి. ముడిబియ్యంలో అయితే 2, 3 నెలలైనా గానీ పురుగు పట్టదు. అదే తెల్లటి బియ్యానికౌతే 7,
8 నెలలైనా పురుగు పట్టదు.

ముడి బియ్యం అన్నం అరగదనేది అపోహ మాత్రమే. గోధుమలు, రాగులను, జొన్నలను కూడా అన్నంగా వండుకునైనా తినవచ్చు. పళ్లు లేనివారు ఎర్రటి గోధుమ రవ్వను వండుకొని తినవచ్చు. విరేచనం సాఫీగా అవుతుంది. తెల్ల గోధుమ రవ్వ అయితే పాలిష్ పట్టి ఉంటారు కాబట్టి లాభముండదు. అన్నం బదులుగా రొట్టెలు లేదా మూడు, నాలుగు రకాల
గింజలను కలిపి ఆడించి ఆ పిండితో రొట్టెలు చేసుకోవచ్చు.

పాలిపోయే బియ్యపు అన్నాన్ని తినే సంస్కృతిని పక్కన బెట్టి మంచి బలాన్నందించే
ముడిబియ్యాన్నే వాడుకోవడం ఉత్తమం.

డాక్టర్ దగ్గర ఈ బుడ్డోడు చెప్పే సాకులు వింటే నవ్వు ఆపుకోలేరు. 19/09/2020

https://youtu.be/SGEl4PbPnzU

డాక్టర్ దగ్గర ఈ బుడ్డోడు చెప్పే సాకులు వింటే నవ్వు ఆపుకోలేరు. JANATA NEWS TELUGU JANATA TV MY DIGITAL CLASS TEACHER Alexander gundeboina Maa P***e Ruchulu Happy Bachpan Play Schools D Mart International

Want your business to be the top-listed Beauty Salon in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad
500001